మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (18:09 IST)

కొత్తిమీరను నీటిలో మరిగించి... ఇలా చేస్తే..?

కొత్తిమీరను ధనియాల నుంచి వస్తుంది. కొత్తిమీర వాసన చాలా బాగుంటుంది. కొత్తిమీరను ఎక్కువగా వంటకాలలో ఉపయోగిస్తారు. భారతీయ వంటకాల్లో కొత్తిమీరతో పలురకాల వంటకాలు తయారుచేస్తారు. అంటే.. కొత్తిమీరను గ్రైండ్ చేసి అందులో కొద్దిగా పెరుగు కలిపి సాస్‌లా చేస్తారు. ఈ సాస్‌ను పానీపూరీ, నాన్‌వెజ్ వంటి వంటకాల్లో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న కొత్తిమీరలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం...
 
చర్మ సౌందర్యానికి మెుదటి స్థానం కొత్తిమీరదే. ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా తక్షణమే ఉపశమనం కలిగేలా చేస్తుంది. ఎముకల బలానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇంకా.. కొలెస్ట్రాల్, పంటి అల్సర్, బరువు, మధుమేహం, క్యాన్సర్ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. కంటి సమస్యలు, రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుతుంది.

కొత్తిమీరలో విటమిన్ సి, మినరల్స్, న్యూటియన్స్ అధిక మోతాదులో ఉంటాయి. కొత్తిమీరను పేస్ట్ చేసి అందులో కొద్దిగా ఉప్పు, అన్నం వంచిన గంజి కలిపి సేవిస్తే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. అధిక బరువు గలవారు ప్రతిరోజూ ఉదయాన్నే కొత్తిమీరతో తయారుచేసిన జ్యూస్ తీసుకుంటే బరువు తగ్గుతుంది.  
 
ధనియాలు రాత్రి నీటిలో నానబెట్టి మరునాడు ఉదయాన్నే పేస్ట్ చేసుకుని వేనీళ్లల్లో కలిపి సేవిస్తే నోటి అల్సర్ తగ్గుముఖం పడుతుంది. ఆస్తమా వ్యాధితో బాధపడేవారు.. రోజూ వారి ఆహారంలో ధనియాలు చేర్చుకుంటే ఫలితాలు పొందవచ్చును. ధనియాల పొడిలో కొద్దిగా తేనె కలిపి సేవిస్తే కడుపునొప్పి తగ్గుతుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు కూడా తొలగిపోతాయి. 

కొత్తిమీరను నీటిలో మరిగించి అందులో కొద్దిగా ఉప్పు, కారం, చింతపండు గుజ్జు కలిపి కాసేపు అలానే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని రోజూ సేవిస్తే శరీర నొప్పులు తగ్గుతాయి.