1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ttdj
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (13:57 IST)

అలర్జీనా... జీలకర్రే ఔషధం...!

జీలకర్ర ఎలర్జీ వ్యాధులకి మంచి ఔషధం. జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. అంతేకాదు బిపిని, షుగర్‌ని నియంత్రణలో ఉంచుతుంది. కడుపులో నులిపురుగులు నివారణకు జీలకర్ర ఎక్కువగా తీసు

జీలకర్ర ఎలర్జీ వ్యాధులకి మంచి ఔషధం. జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. అంతేకాదు బిపిని, షుగర్‌ని నియంత్రణలో ఉంచుతుంది. కడుపులో నులిపురుగులు నివారణకు జీలకర్ర ఎక్కువగా తీసుకోవచ్చు.
 
జీలకర్ర కడుపుకి సంబంధించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది. అజీర్ణంతో బాధపడేవారు. వికారంగా ఉన్నప్పుడు అరగక పుల్లని త్రేన్పులతో బాధపడేవారు జీలకర్రను నములుతూ రసం మింగితే వెంటనే ఉపశమనం కలుగుంది. స్త్రీ గర్భాశయాన్ని శుద్ధి చేసి అందులో సమస్త దోషాలను హరించి గర్భసంచిని బలసంపన్నంగా ఉంచే శక్తి జీలకర్రకి కలదు.
 
మొలలతో బాధపడేవారు జీలకర్ర, పసుపుకొమ్ములు సమానంగా కలిపి మెత్తగా దంచి కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని రోజూ మూడుపూటలా రెండు మాత్రలు చొప్పున వాడితే మొలల బాధ తగ్గుతుంది. జీలకర్ర, బెల్లం కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా కట్టుకుని ఉదయం, రాత్రి తింటే వీర్యపుష్టి కలుగుతుంది.