గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సందీప్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:21 IST)

పాలిచ్చే తల్లులు నల్ల నువ్వులు ఆరగిస్తే..

నువ్వులతో మనం అనేక రకాల స్వీట్లు తయారు చేసుకుంటాం. నువ్వుల నూనెను వంటకాల్లో, దీపారాధనకు ఉపయోగిస్తాం. నవ్వులు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా నల్ల నువ్వులు తింటే ఇంకా మంచిది. వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలను ఇవి సమర్థవంతంగా ఎదుర్కొంటాయని పరిశోధనల్లో తేలింది. 
 
వీటిలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. చాలా మందిలో విటమిన్ బి, ఐరన్ లోపం వల్ల జ్ఞాపకశక్తి మందగించడం, జుట్టు రాలిపోవడం, తెల్లబడటం జరుగుతుంటుంది. నల్ల నువ్వుల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి. వీటిలోని విటమిన్ ఇ చర్మ సౌందర్యానికి దోహదపడుతుంది. నల్ల నువ్వులు తింటే కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. పేగు కేన్సర్ రాకుండా ఉంటుంది. 
 
నువ్వుల్లోని సిసేమిన్ లివర్ దెబ్బతినకుండా రక్షిస్తుంది. దీనిలోని పీచు, అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇందులోని నూనె పేగులు పొడిబారకుండా చూస్తాయి. వీటిని మెత్తగా రుబ్బి తీసుకున్నట్లయితే కడుపులోని నులిపురుగులు బయటకు వెళ్లిపోతాయి. నువ్వులలోని మెగ్నీషియం బీపీని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. 
 
సాధారణంగా ఆడవారిలో 35 యేళ్లు దాటితే ఎముక బరువు క్రమంగా తగ్గుతుంది. మెనోపాజ్ సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువ. అందుకే కాల్షియం, జింక్ ఎక్కువగా ఉండే నల్లనువ్వులను ఆహారంలో భాగంచేసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. పాలిచ్చే తల్లులు నల్ల నువ్వులు తింటే చాలా మంచిది.