మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (13:43 IST)

చిక్కుళ్ళను, బెల్లం పాకంలో ఉడికించి తింటే..?

ముఖ్యమైన ఆహార పదార్థాలలో ఒకటి చిక్కుడు. దీనిలో లెసితిన్ అనే పదార్థం ఎక్కువగా లభిస్తుంది. ఈ పదార్థం మెదడులో ఎక్కువగా ఉంటుంది. నాడీ బలానికి, ఆరోగ్యానికి ఈ పదార్థం ఎంతగానో ఉపయోగపడుతుంది. అరకప్పు వండిన చిక్కుళ్ళల్లో ఒక కోడిగుడ్డులో లభించే పోషక విలువలు లభిస్తాయి. ఎండుచిక్కుళ్ళల్లో 104 గ్రా మాంసకృత్తులు, ఇనుము, క్యాల్షియం, విటమిన్ బి, నియాసిస్, పిండి పదార్థాలు మొదలగు పోషక పదార్థాలు లభించును.
 
450 గ్రా ఎండు చిక్కుళ్ళలో 3.8 మి.గ్రా. విటమిన్ బి లభిస్తుంది. ఇది ఒక రోజుకు అవసరమయ్యే విటమిన్ బి కన్నా మూడురెట్లు ఎక్కువ, దీనిపాలను రక్తపోటు, మధుమేహ వ్యాధులకు బలవర్థకంగా ఉపయోగిస్తుంది. నరాల బలహీనత, నిద్రలేమిని దూరం చేస్తుంది. ఒక పౌను ఎండు చిక్కుళ్ళల్లో 10 మి.గ్రా. నియాసిస్, 29 మి.గ్రా. ఇనుము, 95 మి.గ్రా. విటమిన్ బి లభిస్తాయి.
 
ఒక కప్పు చిక్కుళ్ళను, బెల్లం పాకంలో ఉడికించి తింటే ఒక కప్పు పాలలో లభించే క్యాల్షియం లభిస్తుంది. చిక్కుళ్ళు సులభంగా జీర్ణమవుతాయి. వీటిని ముందుగా నానబెట్టి, బాగా ఉడికించి వండుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, రక్తహీనత, ఉబ్బసం మొదలగు వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా పనిచేస్తుంది. దీనిలో క్రొవ్వు శాతం తక్కువ కావడం వలన హానికరం కాదు. వీటిని శుభ్రపరచి వాడడం వలన వీటిలో గల చిన్న చిన్న లోపాలను నివారించుకోవచ్చును.