సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (10:31 IST)

కొబ్బరినూనెతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చును...

కొబ్బరి నూనెలోని ఔషధగుణాలు నిద్రలేమి సమస్యను తొలగిస్తాయి. అసలు నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుందంటే.. ఒత్తిడి, నీరసంగా ఉన్నప్పుడు లేదా ఎక్కువగా ఆలోచిస్తే కూడా నిద్రపట్టదు. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో చూద్దాం..
 
ప్రతిరోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే నిద్రలేమి సమస్య ఉండదు. దాంతో పాటు మరోనాడు నిద్రి లేచినప్పుడు ఒత్తిడి తొలగిపోయి ఉత్సాహంగా ఉంటారు. కొబ్బరి నీళ్లు తరచుగా సేవిస్తే పురుషుల్లో వీర్యం చక్కబడి లైంగిక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొబ్బరి నూనెతో పలురకాల వంటలు తయారుచేసుకోవచ్చును.
 
చాలామంది చిన్న వయస్సులోనే జీర్ణ శక్తిని కోల్పోతుంటారు. అందుకు తగిన మందులు కూడా వాడుతుంటారు. ఈ మందులు వాడడం వలన  జీర్ణశక్తి మెరుగుపడుతుందని నమ్ముతారు. కానీ, అలా జరగదు. ఎందుకంటే.. ఈ మందుల్లోని కెమికల్స్ అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని చెప్తున్నారు. అందువలన వీలైనంత వరకు మందులు వాడడం మానేయండి.
 
ఈ అజీర్ణక్రియ సమస్య నుండి ఎలా విముక్తి లభిస్తుందో తెలియక సతమతమవుతుంటారు. అందుకు కొబ్బరి నూనె దివ్యౌషధంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలోని కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు జీర్ణశక్తి పెంచుతాయి. ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహార పదార్థాలలో కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.