బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 26 అక్టోబరు 2018 (19:04 IST)

అలా అవడంతో నిద్ర మాత్రలు వేసుకున్న శ్రీరెడ్డి... ఎలా ఉంది?

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నంలో జరిగిన దాడికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. రాజకీయ నేతలు మాత్రం ఒక్కొక్కరు ఒక్కో విధంగా విమర్శలు చేసుకుంటే జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు మాత్రం ఆయనపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు. అందులో ముఖ్యంగా శ్రీరెడ్డి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని పంపింది శ్రీరెడ్డి.
 
శ్రీరెడ్డి ట్వీట్ చేసిన సందేశం... జగనన్నకు ఏమైంది. నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. జగనన్నపై దాడి జరిగిన విషయం తెలుసుకుని నివ్వెరపోయా. కొద్దిసేపు పాటు నా నోటి నుంచి మాటలు రాలేదు. కన్నీటి పర్యంతమయ్యా. రాత్రి తిండి కూడా తినలేదు. ఒంటరిగా కూర్చున్నా. అలాగే పడుకొనిపోయా. 
 
ఎంతకూ నిద్రరాలేదు. నిద్ర రాకపోవడంతో నిద్ర మాత్రలు వేసుకున్నా. అయినా కూడా నిద్ర రాలేదు. మా అన్నకు అలా జరగడం చాలా బాధగా ఉంది. త్వరగా జగనన్న కోలుకోవాలని దేవుళ్ళను ప్రార్థిస్తున్నానంటోంది శ్రీరెడ్డి.