బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (14:26 IST)

ఇలా చేస్తే బొజ్జ కరిగిపోతుందట... నిజమా?

చాలా మంది ఆహారం తక్కువే తీసుకుంటున్నా.. బొజ్జ మాత్రం పెద్దదిగా ఉంటుంది. దీంతో వారు తీవ్ర అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఇలాంటి వంటిట్లో లభ్యమయ్యే అల్లంతో (పెరటి వైద్యం) బొజ్జను కరిగించుకోవచ్చు. అదీకూడా జిమ్

చాలా మంది ఆహారం తక్కువే తీసుకుంటున్నా.. బొజ్జ మాత్రం పెద్దదిగా ఉంటుంది. దీంతో వారు తీవ్ర అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఇలాంటి వంటిట్లో లభ్యమయ్యే అల్లంతో (పెరటి వైద్యం) బొజ్జను కరిగించుకోవచ్చు. అదీకూడా జిమ్‌లు, వాకింగ్, రన్నింగ్‌లకు వెళ్లకుండానే. అదెలాగో ఓసారి పరిశీలిద్ధాం. 
 
సాధారణంగా అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని పెద్దలు చెపుతుంటారు. ముఖ్యంగా, ఊబకాయాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అల్లంలో కొవ్వును కరిగించే అంశాలతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేసే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందుకోసం అల్లాన్ని దంచి రసం తీయాలి. ఆ రసాన్ని పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి. 
 
పాత్రలో ఎంత అల్లం రసం ఉంటే దానికి సమానంగా తేనె కలిపి, మళ్లీ కాసేపు పొయ్యి మీద ఉంచి దించేయాలి. చల్లారిన తర్వాత సీసాలో నిల్వ చేయాలి. అందులోంచి ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్‌ రసం తీసుకుని, గ్లాసు వేడి నీళ్లు కలిపి భోజనానికి ముందు సేవించాలి. ఇలా రోజూ చేస్తే బొజ్జ కరిగిపోవడం మొదలవుతుంది.