ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 9 మే 2024 (22:48 IST)

పాలులో కాస్త అల్లం తురుము వేసి తాగితే ఇవే ప్రయోజనాలు

golden Milk
ఆరోగ్యానికి అల్లం ఎంతో మేలు చేస్తుంది. ఈ అల్లాన్ని ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఉప‌యోగిస్తున్నారు. ఈ అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము.
 
అల్లం పాలుతో జ‌లుబు, ఫ్లూ, అజీర్ణం, ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
అల్లం పాలు తాగితే రోగ నిరోధ‌కశ‌క్తి పెరగడమే కాకుండా వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.
అల్లం, పాలు రెండింటినీ క‌లిపి తాగ‌డం వ‌ల్ల ల‌భించే పోష‌కాలు ఆరోగ్యంగా ఉంచుతాయి.
అల్లం పాలు త‌యారీకి ఒక కప్పు పాలు, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం తీసుకోవాలి.
చిటికెడు న‌ల్ల మిరియాల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, తగినంత బెల్లం సిద్ధం చేసుకోవాలి.
పాత్ర‌లో పాల‌ను తీసుకుని అందులో తురిమిన అల్లం వేసి 5 నిమిషాల పాటు మ‌రిగించాలి.
ఆ తర్వాత న‌ల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేయాలి.
పాత్ర‌ను దించి అందులో బెల్లం పొడి వేసి బాగా కలపాలి.
అలా త‌యారైన అల్లం పాల‌ను గోరువెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి.