శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (10:26 IST)

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

gun shot
అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం సృష్టించారు. ఓక్లహోమాలో జరిగిన ఓ వేడుకలో దండగుడు ఒకటు ఈ కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. 
 
గత వారం టెక్నాస్‌లోని ఉవాల్డాలో ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ ఉన్మాది ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ పీడకల నుంచి అమెరికా ప్రజలు ఇంకా మరిచిపోకముందే మరో కాల్పుల ఘటన జరిగింది. 
 
అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఒక్లహోమాలోని ఓల్డ్ సిటీ స్కేర్‌లో మెమోరియల్ డే ఫెస్టివల్ జరిగింది. దీనికి దాదాపు 1500 మంది వరకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆహుతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. 
 
ఈ క్రమంలో సహనం కోల్పోయిన స్కైలర్ బక్నర్ అనే 26 యేళ్ళ వ్యక్తి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక నల్లజాతి మహిళ చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ కాల్పులకు తెగబడిన ఉన్మాది పోలీసులకు లొంగిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.