ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (14:15 IST)

విష వాయువు పీల్చి... జార్జియాలో 12 మంది మృతి

Georgia
Georgia
జార్జియాలో విషయ వాయువు పీల్చడం వల్ల 12 మంది మృతి చెందారు. వీరిలో 11 మంది భారతీయులు ఉండటం గమనార్హం. రాత్రిపూట రిసార్ట్ మూసివేశాక తమ గదిలో పడుకున్న వారంతా పడుకున్నట్టే మృతి చెందారు. ప్రాథమిక విచారణ తర్వాత రిసార్ట్ సిబ్బంది మరణానికి కార్బన్ మోనాక్సైడ్ వాయువే కారణమని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గుడౌరిలోని రిసార్టులో చోటుచేసుకున్న విషాదంపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. 
 
11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొంది. కాగా, గుడౌరీలోని రిసార్ట్‌లో ఈ నెల 14న మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు కానీ, గాయాల ఆనవాళ్లు కానీ లేవని చెప్పారు. 
 
సిబ్బంది కోసం కేటాయించిన గది రిసార్ట్ రెండో అంతస్తులో ఉందని, దాని పక్కనే జనరేటర్ ఉందని వివరించారు. 
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్‌ను ఆన్ చేసి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. 
 
అయితే, కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఎలా విడుదలైందనే వివరాలు కానీ, సిబ్బంది మరణాలకు కచ్చితమైన కారణం కానీ తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. సిబ్బంది మరణానికి కారణం గుర్తించేందుకు దర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరించారు.