శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2020 (16:42 IST)

లాటరీ టిక్కెట్‌ను భిక్షమేసింది.. అంతే ఆ నలుగురు లక్షాధికారులు అయ్యారు..

EUROS
బిచ్చగాళ్లకు లాటరీ తగిలింది. అంతే.. రూ.43 లక్షలు గెలుచుకుని లక్షాధికారులు అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉపాధి లేకపోవడంతో ఓ నలుగురు బిచ్చగాళ్లుగా మారారు. వీరికి రోజూ పొట్ట గడవడమే కష్టంగా ఉండేది. బిచ్చమెత్తగా వచ్చిన డబ్బుతో కడుపు నింపుకునేవారు. అయితే వీరు లాటరీ టికెట్లు అమ్మే దుకాణం వద్ద బిచ్చమెత్తేవాళ్లు. ఎందుకంటే లాటరీ టికెట్లు కొనేందుకు అక్కడికి జనం ఎక్కువగా వస్తారనేది వీరి ప్లాన్‌. 
 
ఒకరోజు అక్కడికి ఓ యువతి వచ్చి లాటరీ టికెట్ కొనింది. పక్కనే ఉన్న ఈ నలుగురు బిచ్చగాళ్లు దానం చేమయని ప్రాధేయపడ్డారు. అయితే వీరు అడిగింది డబ్బు దానం చేయమని, కానీ ఆ యువతి మాత్రం చేతిలో ఉన్న లాటరీ టికెట్‌ను వీరికి బిచ్చమేసింది. దీంతో వీరు డబ్బులిచ్చి ఉంటే బాగుండేది ఎందుకూ పనికిరాని టికెట్ ఇచ్చి వెళ్లిందని గొనుక్కుంటూ ఆ టికెట్‌ను స్క్రాచ్ చేసి చూశారు.
 
టికెట్ చూడగానే ఆ నలుగురు షాకయ్యారు. వారికి లాటరీ తగలింది. పాపం రూ.87పెట్టి కొన్న ఆ యువతి టికెట్‌ను స్క్రాచ్ చేయకుండా ఎందుకు వీరికి బిచ్చమేసిందో కాని లక్ష్మీదేవి మాత్రం బిచ్చగాళ్లను కరుణించింది. లాటరీలో వీరు రూ.43 లక్షలు గెలుచుకున్నారు. దీంతో టికెట్ ఇచ్చిన మహిళను దేవతగా భావించారు. బిచ్చగాళ్లు లాటరీ గెలుచుకున్న సంగతి నిజమేనని ఫ్రెంచ్‌ లాటరీ ఆపరేటర్‌ ఎఫ్‌డీజే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 
 
యువతి దానం చేయడంతో లాటరీలో గెలుచుకున్న డబ్బులు వీరికే సొంతమని వెల్లడించింది. ఈ డబ్బుతో ఆ నలుగురు ఎవరికి వారు సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారు.