మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (10:29 IST)

న్యూయార్క్‌ వరదలు.. 44మంది మృతి.. రికార్డు స్థాయి వర్షాలతో..

న్యూయార్క్‌ను వరదలు ముంచెత్తాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన వరదల కారణంగా 44మంది ప్రాణాలు కోల్పోయారు. రికార్డు స్థాయిలో వర్షాలు కురువడంతో న్యూయార్క్‌ నగరమంతా వరదల్లో చిక్కుకుంది. వీధులన్నీ నదులను తలపించాయి. 
 
నీరు ఫ్లాట్‌ ఫారమ్‌ల్లోని ట్రాక్‌లపైకి ప్రవహించడంతో సబ్‌ వే సర్వీసులను నిలిపివేశారు. లాగార్డియా, జెఎఫ్‌కె, నెవార్క్‌ విమానాశ్రయాల్లో వందలాది విమాన సర్వీసులను నిలిపివేశారు. న్యూయార్క్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు చూస్తున్నానని 50 ఏళ్ల వ్యక్తి.. రెస్టారెంట్‌ యాజమాని తెలిపారు. ఆయన రెస్టారెంట్‌ బేస్‌మెంట్‌ మూడు అంగుళాల నీటిలో మునిగిపోయింది. ఈ అకాల వర్షాలపై అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. 
 
ఐదా తుఫాన్‌ ధాటికి జరిగిన భారీ నష్టం పట్ల సాయం చేయడానికి దేశమంతా సిద్ధంగా ఉందని లూసియానా పర్యటనకు ముందు తెలిపారు. న్యూయార్క్‌తోపాటు న్యూజెర్సీనీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. న్యూజెర్సీలో భారీ వానలకు కనీసం 23 మంది చనిపోయి ఉంటారని గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ విలేకరులతో అన్నారు.