సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (12:01 IST)

న్యూజిలాండ్‌‍లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

earth quake
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం కెర్మాడెక్ దీవుల రీజియన్‌లో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఇది రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్టు యూనైటెట్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గత నెలలో కూడా కెర్మాడెక్ దీవుల్లో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. 
 
ఈ భూకంపంతో న్యూజిలాండ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని ఆ దేశ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిసింది. అయినప్పటికీ ఆయన ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. కెర్మాడెక్ దీవుల్లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ దీవులు భౌగోళికంగా పసిఫిక్, ఆస్ట్రేలియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య జరుగుతున్న తాకిడి నుంచి పైకివచ్చిన శిఖరంపై ఏర్పడ్డాయి. దీంతో ఈ రీజియన్‌లో భూకంపాలు సర్వసాధారణగా మారిపోయాయి.