గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (14:45 IST)

70 ఏళ్లలో కవలపిల్లలకు జన్మనిచ్చిన వృద్ధురాలు

Twin Baby
70 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు కవల పిల్లలకు జన్మనిచ్చింది. సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా తల్లయిన ఆమె ఆఫ్రికాలోనే అత్యంత పెద్దవయసులో తల్లయిన మహిళగా రికార్డు సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా 70 ఏళ్లలో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.  
 
కంపాలా నగరంలోని ఓ ఆసుపత్రిలో బుధవారం ఆమె సిజేరియన్ ద్వారా ఓ బాబు, పాపకు జన్మనిచ్చారు. వృద్ధురాలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 2020లో కూడా సఫీనా ఈ చికిత్స ద్వారానే ఓ కుమార్తెకు జన్మనిచ్చారు.