అలక చెందిన మొసలి.. మాంసం ముక్క ఇవ్వలేదని.. వీడియో వైరల్
పిల్లలు బొమ్మలు కావాలని అలగి ఏడుస్తుండటం చూసేవుంటాం. కొందరు పిల్లలైతే బొమ్మలు కొనిపెట్టేంత వరకు వదిలిపెట్టరు. ఇక్కడ విషయం ఏమిటంటే.. జంతువులు కూడా అలుగుతాయని తెలిసింది. అటువంటి వాటిల్లో ఈ మొసలి కూడా ఒకటి. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎవర్ గ్రేడ్స్ హాలిడా పార్క్‌లో ఓ మొసలి ఉంది. ఆ మొసలికి ఇద్దరు కేర్ టెకర్లు ఉన్నారు.
ఓ రోజు కేర్ టేకర్ జంట మొసలికి మాంసం అందించేందుకు కొలను వద్దకు వెళ్లారు. మాంసం ముక్కను అందుకో అంటూ దానిని ఆడించారు. కానీ, అది అందుకోలేకపోయింది. మాంసం ముక్క కింద పడింది. నువ్వు ఓడిపోయావని గేలి చేయడంతో ఆ మొసలికి కోపం వచ్చేసింది.
అంతటితో ఆగకుండా కింద పడిన మాంసం ముక్కను తినకుండా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. తర్వాత కేర్ టేకర్ మాంసం ముక్కను చూపిస్తూ తినమని బతిమిలాడటంతో ఆ ముక్కను తీసుకొని నీళ్ళల్లోకి వెళ్ళింది. దీనికి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.