మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (16:22 IST)

చైనాలోని ఫోషాన్ నగరంలో సుడిగాలి బీభత్సం (video)

Tornado
Tornado
దక్షిణ చైనాలోని ఫోషాన్ నగరంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. దీంతో ఆ నగరం అంతా అతలాకుతలం అయింది. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 7.20 గంటలకు వేగవంతమైన గాలులు వీచాయి. ఈ సుడిగాలి వల్ల చెట్లన్ని నేలకూలాయి. 
 
ఇళ్లపైన ఉండే పెంకులు, వాహనాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. విద్యుత్ లైన్లు కూలడంతో పలు చోట్ల ఆకస్మికంగా మంటలు కూడా చెలరేగాయి.
 
వీటికి సంబంధించిన వీడియోలను మాటేస్ సోబిరాజ్, ఇరిక్ వాంగ్ అనే వ్యక్తులు తమ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.