శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 11 డిశెంబరు 2021 (18:16 IST)

అమెరికాలో 24 టోర్నడోలు బీభత్సం, 50 మంది మృతి: అనేక ఇళ్లు నేలమట్టం

అమెరికాలో 24 టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం చివరిలో, శనివారం ప్రారంభంలో కెంటుకీ- ఇతర యుఎస్ రాష్ట్రాలలో విధ్వంసకర టోర్నడోల భయానక పెనుగాలలతో కనీసం 50 మంది మరణించే అవకాశం ఉందని కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు.
 
 
మొత్తం 24 టోర్నడోలు ఒకటి తాకిన తర్వాత 200 మైళ్లకు పైగా భూమిపై ఉండి, రాష్ట్రం ద్వారా దూసుకుపోయాయని బెషీర్ చెప్పారు. దాదాపు 60,000 మంది కెంటుకియన్లకు విద్యుత్ లేకుండా పోయిందన్నారు. 
 
మేఫీల్డ్ నగరంలో ఇవి విధ్వంసాన్ని సృష్టించాయనీ, పైకప్పు కూలిపోవడంతో కొవ్వొత్తుల కర్మాగారంలో సామూహిక ప్రాణ నష్టానికి దారితీశాయన్నారు.