గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (17:51 IST)

సెల్ఫీ పిచ్చి.. పిట్టగోడ ఎక్కి సెల్ఫీ.. అంతే 80 మీటర్ల ఎత్తు నుంచి..?

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం జరుగుతోంది. దీంతో సెల్ఫీ పిచ్చి జనాలకు మామూలుగా లేదు. తాజాగా సెల్ఫీ పిచ్చితో ఓ మహిళ బలైంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని గ్రాంపియన్స్ నేషనల్ పార్క్‌కు శనివారం ఓ కుటుంబం వెళ్లింది. 
 
కుటుంబసభ్యులు ఇతర ప్రదేశాల్లో ఫొటోలు తీసుకుంటుండగా.. ఓ మహిళ మాత్రం పిట్టగోడ ఎక్కి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది. సెల్ఫీ తీసుకుంటుండగా మహిళ ఒక్కసారిగా కాలు జారి 80 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. 
 
కుటుంబసభ్యుల కంటి ముందే మహిళ చనిపోవడం పట్ల పార్క్ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. అంత ఎత్తు నుంచి పడిపోవటంతో రెస్క్యూ సిబ్బంది కూడా వెంటనే ఏమీ చేయలేకపోయారు. ప్రత్యేక హెలికాప్టర్ సాయంతో అధికారులు మహిళ మృతదేహాన్ని వెలికితీసినట్టు తెలుస్తోంది.