సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (11:39 IST)

ఇజ్రాయేల్ దాడులు.. గర్భిణీ మృతి.. ప్రాణాలతో బయటపడిన గర్భస్థ శిశువు

Baby
Baby
ఇజ్రాయేల్ సైన్యం నిర్వహించిన దాడిలో పాలస్తీనా గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె గర్భస్థ శిశువు ప్రాణాలతో బయటపడింది. ఇజ్రాయేల్- హమాస్‌ల మధ్య గత ఏడాది యుద్ధం ప్రారంభమైంది. 
 
హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయేల్ జరుపుతున్న దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది అక్కడ నుంచి తప్పించుకుని వలసదారుల పేరిట ఈజిప్టు సరిహద్దు వద్ద వున్న రబా నగరానికి చేరుకుంటున్నారు. 
 
అయితే ఇజ్రాయేల్ ప్రస్తుతం రబాపై దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రబా నగరంపై ఇజ్రాయేల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. 
 
సఫ్రీన్ అల్ సహానీ అనే మహిళ 30 వారాల గర్భిణీగా వున్నది. ఆమె ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. కానీ గర్భస్థ శిశువు ప్రాణాలతో బయటపడింది. వెంటనే శస్త్రచికిత్స ద్వారా ఆ ఆడశిశువును కాపాడారు.