శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (06:55 IST)

అమెరికా ఓటర్లను ఆకట్టుకుంటున్న బిడెన్‌.. వర్షంలోనూ ప్రచారం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో మూడు రోజులే వ్యవధి వున్న తరుణంలో ట్రంప్‌, బిడెన్‌లు ఫ్లోరిడాలో శుక్రవారం పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాల్సిందిగా ఇరువురూ ఓటర్లను అభ్యర్థించారు.

ఆగేయ ప్రాంతంలో తుపాను కారణంగా ఎర్లీ ఓటింగ్‌కు అంతరాయం కలిగింది. ఫ్లోరిడాలో ప్రజల నాడి ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. పైగా ఈ ఎన్నికల్లో ఇక్కడ కాస్త గట్టిగా పోటీ జరిగే అవకాశాలు వున్నాయి. ఫ్లోరిడా అంతర్రాష్ట్ర కారిడార్‌ను ట్రంప్‌, బిడెన్‌ సందర్శించారు.

భారీగా వర్షం పడుతున్నా లెక్కచేయకుండా బిడెన్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను డెమొక్రటిక్‌ పార్టీ మద్దతుదారులు పోస్ట్‌ చేశారు. 'బిడెన్‌ తీవ్రంగా ప్రచారం చేయడం లేదన్న మాటను కొట్టిపారేద్దామా?' అనే శీర్షికతో కొందరు ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

''తుపాను వెళ్ళిపోతుంది, కొత్త రోజు వస్తుంది.'' అని బిడెన్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో వున్న ఫోటో 14వేల సార్లు ట్వీట్‌ అయింది. వర్షాలు పడుతున్నా తాను ఓటు వేశానని ఒక ఓటర్లు చెప్పారు. తన తల తడిసిపోతుందేమోనని ట్రంప్‌ భయపడతారు, అందుకే ఆయన ఇలా ప్రచారం చేయలేరు, కానీ బిడెన్‌ చేయగలరని మరో ఓటరు వ్యాఖ్యానించారు.
 
బిడెన్‌కే ఆధిక్యం - ఫ్లోరిడాలో ట్రంప్‌నకు స్వల్ప మొగ్గు : ఓ సర్వేలో వెల్లడి
ఎన్నికల ముందు క్వినిపియాక్‌ యూనివర్శిటీ తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రంప్‌నకు ఫ్లోరిడాలో స్వల్ప మొగ్గు ఉన్నా దేశ వ్యాపితంగా చూసినప్పుడు డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి బిడెన్‌కే ఆధిక్యత లభిస్తుందని వెల్లడైంది.

ట్రంప్‌, బిడెన్‌లకు ఫ్లోరిడాలో 46ా42పాయింట్లు రాగా, అయోవాలో 47ా46పాయింట్లు వచ్చాయి. పెన్సిల్వేనియాలో బిడెన్‌కు 51పాయింట్లు రాగా, ట్రంప్‌కు 44మాత్రమే వచ్చాయి. ఓహియోలో ఇది 48-43గా వుంది.

ఈ నెల ఆరంభంలో క్వినిపియాక్‌ యూనివర్శిటీ బిడెన్‌కు ఫ్లోరిడాలో ఏకంగా 11 పాయింట్లు ఆధిక్యత ఇవ్వగా ట్రంప్‌కు ఓహియోలో గత పోల్స్‌ కన్నా 4పాయింట్లు తగ్గించింది.

అయితే దేశవ్యాప్తంగా చూసినట్లైతే బిడెన్‌ 54ా42 శాతంతో ఆధిక్యంలో వున్నారని సిఎన్‌ఎన్‌, ఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌ పోల్స్‌ పేర్కొంది. రియల్‌ క్లియర్‌ పాలిటిక్స్‌, 538 వెబ్‌సైట్లు వరుసగా గురువారం మధ్యాహ్నానికి బిడెన్‌కు 7.4, 8.8పాయింట్లతో జాతీయ ఆధిక్యతను ఇచ్చాయి.