మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 4 మే 2019 (11:50 IST)

నదిలోకి దూసుకెళ్లిన విమానం.. క్షేమంగా ప్రయాణికులు

ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్‌విల్లేలో ఓ విమానం నదిలోకి దూసుకెళ్లింది. క్యూబాలోని నావల్ స్టేషన్ గ్వాంటనామో బే నుంచి నావల్ ఎయిర్ స్టేషన్ జాక్సన్‌విల్లేకు బయలుదేరిన బోయింగ్ 737 విమానం.. శుక్రవారం రాత్రి సమయంలో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా రన్‌వే నుంచి అదుపుతప్పింది. 
 
ఆ తర్వాత వేగాన్ని నియంత్రించలేక పోవడంతో ఆ విమానం కాస్త పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్ళింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులుండగా, వీరంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. 
 
బోయింగ్ విమానం నదిలోకి దూసుకెళ్లగానే వెంటనే స్పందించిన ఎయిర్ ‌పోర్ట్ అధికారులు... ప్రయాణికుల్ని రక్షించేందుకు సలహయక చర్యలు చేపట్టారు. హుటాహుటిన నేవీ సెక్యూరిటీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ పర్సన్స్ కూడా రంగంలోకి దిగింది... ప్రత్యేక బోట్లలో ప్రయాణికుల్ని ఒడ్డుకి చేర్చారు. అధికారులు వెంటనే స్పందించడంలో భారీ ప్రమాదం తప్పింది.