1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (12:22 IST)

ఉగ్రమూకల ఊచకోత.. 43మంది వ్యవసాయ కూలీలను చంపేశారు..

ఉగ్రమూకలు రెచ్చిపోయారు. ఈశాన్య నైజీరియాలోని మైదుగురి నగర సమీపంలోని కోషోబ్లో బోకోహరమ్ తీవ్రవాదులు అత్యంత దారుణంగా 43మందిని హతమార్చారు. పొలంలో పనిచేసుకుంటున్న వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి చేతులు కట్టేసి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఇది అత్యంత భయానక ఘటనగా ఐక్యరాజ్య సమితి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎడ్వర్డ్ కల్లోన్ పేర్కొనారు. 
 
బోకోహారమ్ తీవ్రవాదులే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన రైతులకు నైజీరియా ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. హత్యకు గురైన రైతు కూలీల్లో పదిమంది మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.