శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (10:31 IST)

మీ పిల్లవాడు టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నాడా.. జర జాగ్రత్త..

సాధారణంగా కొంతమంది టాయిలెట్‌లో సైతం మొబైల్ ఫోన్ వాడుతుంటారు. కొన్నిసార్లు దాని వల్ల విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిదే చైనాలో జరిగింది. విషయమేమిటంటే చైనాలో ఓ పిల్లవాడు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు. 
 
సుమారు గంటకు పైగా టాయిలెట్‌పై కూర్చొని మొబైల్ ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ కూర్చున్న పిల్లాడు పైకి లెచేందుకు ప్రయత్నించగా, టాయిలెట్‌లో నుండి పైకి లేవలేకపోయాడు. దీంతో టాయిలెట్‌లో ఇరుక్కుపోయామనే విషయం తెలుసుకున్న పిల్లాడు గట్టిగా కేకలు పెట్టాడు. 
 
వెంటనే అక్కడికి వచ్చిన తల్లి అతడిని బయటకు లాగే ప్రయత్నం చేసింది. కాగా పిల్లాడు పూర్తిగా అందులో ఇరుక్కుపోవడంతో ఆమెకు అతడిని రక్షించడం వీలు కాలేదు. దీంతో ఆమె వెంటనే అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసింది. 
 
చివరకు ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ పిల్లాడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. మొదట చిన్న కత్తిని ఉపయోగించి కత్తితో టాయిలెట్‌పై సీట్ కట్ చేసారు. ఆ తర్వాత ఇతర వస్తువుల సాయంతో కమోడ్‌ని కట్ చేసి పిల్లాడిని బయటకు తీసారు. ఈ క్రమంలో బుడతడు చిన్న చిన్న గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. దీంతో తల్లి ఊపిరిపీల్చుకుంది. 
 
కాబట్టి మీ పిల్లలు కూడా ఎప్పుడైనా టాయిలెట్‌లో మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తుంటే కాస్తంత జాగ్రత్త వహించమని చెప్పండి, లేదంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి.