శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (11:27 IST)

అమెరికన్లకు శుభవార్త.. ఇక మాస్క్ ధరించనక్కర్లేదు...

అమెరికా ప్రజలకు ఓ శుభవార్త. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఇకపై ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. బహిరంగ ప్రదేశాల్లో కూడా స్వేచ్ఛగా తిరగొచ్చు. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) మంగళవారం సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. 
 
ఈ కొత్త మార్గదర్శకాల మేరకు వ్యాక్సినేషన్‌ పూర్తయినవారితో పాటు పాక్షికంగా జరిగినవారు ఇకపై బయట మాస్కుల్లేకుండా తిరగొచ్చు. ఒంటరిగా లేదా కుటుంబసభ్యులతో కలిసి నడకకు, వాహనాలపై షికారుకు వెళ్లొచ్చు. పూర్తి వ్యాక్సినేషన్‌ జరిగిన ప్రజల సమూహంలోకి కూడా వెళ్లొచ్చు. 
 
అయితే పెద్ద గుంపులోకి, కొత్త వ్యక్తుల సమూహంలోకి వెళ్లేప్పుడు మాస్కు ఉంటేనే మేలు. అదే సమయంలో వ్యాక్సిన్లు వేయించుకోనివారు మాత్రం ఇంటిబయట మాస్కులు ధరించడం కొనసాగించాలి.