శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (11:34 IST)

కరోనా వైరస్‌ విషయంలో చైనా అలా వ్యవహరించిందట...!

చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఎంతో మంది ప్రాణాల్ని బలిగొంటున్న సంగతి తెలిసిందే. కాగా, అప్పటి నుంచి ఆ వైరస్‌ చైనా చేసిన పనే అంటూ అమెరికా సహా పలు ప్రపంచ దేశాల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది.
 
ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్‌పై చైనా పారదర్శకంగానే వ్యవహరించిందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మంగళవారం మరోసారి సమర్థించుకున్నారు. కరోనా వైరస్‌పై పోరాట సమయంలో తమదైన పాత్ర పోషించిన వారి కోసం బీజింగ్‌లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా వైరస్‌ విషయంలో చైనా పారదర్శకంగానే వ్యవహరించిందని అన్నారు. 
 
అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో మొదట సానుకూల వృద్ధిరేటు పొందిన ప్రధాన ఆర్థిక వ్యవస్థ కూడా చైనాయే అని చెప్పడం గమనార్హం.