1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (12:54 IST)

టిబెట్‌లో తొలి బుల్లెట్ రైలు.. జూలై ఒకటో తేదీన ప్రారంభం

Bullet Train
టిబెట్‌లో తొట్టతొలి బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌కు సమీపం నుంచి ఈ రైలు మార్గం ఉంది. రాజధాని లాసా నుంచి నింగిచి వరకు రైల్వే మార్గాన్ని కనెక్ట్ చేశారు.

ఈ రైలు మార్గం 435.5 కిలోమీటర్ల దూరం ఉంది. జూలై ఒకటో తేదీన చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో ఈ రైలు మార్గాన్ని ఆవిష్కరించారు. ఈ ఎలక్ట్రిక్ రైలు మార్గాన్ని శుక్రవారం ప్రారంభించారు. 
 
ఫుక్సింగ్ బుల్లెట్ రైలును ఈ కొత్త రూట్లో నడిపించారు. ఖిన్‌ఘాయి-టిబెట్ రైల్వే మార్గం తర్వాత.. సిచువాన్-టిబెట్ రైల్వే రెండవ మార్గం కావడం విశేషం. సరిహద్దుల రక్షణ అంశంలో కొత్త రైల్వే లైన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. 
 
సిచువాన్- టిబెట్ రైల్వే లైన్‌.. చెంగ్డూ నుంచి ప్రారంభం అవుతుంది. సిచువాన్ ప్రావిన్సు రాజధానియే చెంగ్డూ. ఈ కొత్త రైలు మార్గంతో చెంగ్డూ, లాసా మధ్య ప్రయాణం 48 గంటల నుంచి 13 గంటల వరకు తగ్గుతుంది.