బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (08:12 IST)

ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Modi
ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను కేంద్రం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. 
 
రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. రైలు ప్రమాదంలో ఇంత మంది మరణించడం తన మనసును కలిచి వేసిందని ట్వీట్ చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి జాతీయ విపత్తు నిర్వహణ దళాలు (ఎన్డీఆర్‌ఎఫ్) చేరుకున్నాయని హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. 
 
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలయిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని తెలిపారు.