గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తమ్మినేని సీతారాం అంత పని చేశారా? టీడీపీ నేత సంచలన ఆరోపణలు

kuna ravikumar
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికేట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారంటా ఆయన ఆరోపించారు. పైగా, తాను డిగ్రీ పూర్తి చేయలేదని గతంలో తమ్మినేని స్వయంగా చెప్పారని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లోనూ ఇదేవిషయాన్ని గుర్తుచేశారని, అందువల్ల ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్లు, ఏపీ హైకోర్టు సీజే, సీఎం జగన్‌లకు ఆయన లేఖలు రాశారు. 
 
తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని మహాత్మాగాంధీ న్యాయ కాలేజీలో 2019-20లో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్‌తో అడ్మిషన్ తీసుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. 
 
సాధారణంగా న్యాయ కోర్సులో చేరాలంటే డిగ్రీ లేదంటే అందుకు సమానమైన కోర్సు పూర్తి చేయాల్సి వుందని గుర్తుచేశారు. కానీ తమ్మినేని డిగ్రీ గానీ, అలాంటి మరే కోర్సుగానీ చదవలేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే గతంలో ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారని గుర్తుచేశారు.