1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (09:31 IST)

‘గ్రీన్ పాస్’ అర్హత జాబితాలోంచి కోవీషీల్డ్ తొలగింపు

యూరోపియన్ యూనియన్ జూలై 1 నుంచి జారీ చేయనున్న గ్రీన్ పాస్‌లను పొందేందుకు అర్హతగల వ్యాక్సిన్‌ల జాబితా నుంచి సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవీషిల్డ్‌ను ఈయూ తొలగించింది.

ఈ నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా స్పందించారు. ఈయూ తాజా నిర్ణయంతో కోవీషిల్డ్ టీకా తీసుకుని, ఈయూ జారీ చేసే గ్రీన్ పాస్‌లు పొందేందుకు అర్హత కోల్పోయిన భారతీయులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

‘ఈయూ దేశాల ప్రతినిధులతో ఈ విషయంపై చర్చించి, అతి త్వరలో ఈ సమస్య‌ను పరిష్కరించేందుకు కృషి చేస్తాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ కోవీషీల్డ్ పేరుతో భారత్‌లో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.