లోన్లీ ప్లానెట్ 2026, బెస్ట్ ఇన్ ట్రావెల్ టాప్ గ్లోబల్ ఎక్సపీరియెన్సెస్: ఓల్డ్ దుబాయ్‌లోని సాంస్కృతిక ఆహార పర్యటనలు
లోన్లీ ప్లానెట్ యొక్క బెస్ట్ ఇన్ ట్రావెల్ గుర్తింపులో 2026 సంవత్సరానికి గానూ టాప్ గ్లోబల్ ఎక్సపీరియెన్సెస్‌లో ఒకటిగా ఓల్డ్ దుబాయ్‌లో సాంస్కృతిక ఆహార పర్యటన నిలిచింది. ఇది దుబాయ్ యొక్క వైవిధ్యమైన, ప్రత్యేకమైన వంటకాల వైభవాన్ని వెల్లడిస్తుంది. వారసత్వం, సంప్రదాయాలపై నిర్మించబడిన నగరం, దుబాయ్. విభిన్న రుచులకు నిలయమైన ఈ నగరం దాదాపు 200 దేశాల వాసుల అభిరుచులచే ప్రభావితమైంది. చారిత్రాత్మక దుబాయ్ క్రీక్ వెంబడి ఉన్న బుర్ దుబాయ్, డీరా వంటి ప్రాంతాలలోని రెస్టారెంట్లను స్థానిక పదార్థాలు, విలువ, ప్రామాణికత పరంగా ఎక్కువమంది ఇష్టపడతారు.
దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET)లో భాగమైన దుబాయ్ కార్పొరేషన్ ఫర్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ (విజిట్ దుబాయ్) సీఈఓ ఇస్సామ్ కజిమ్ మాట్లాడుతూ, ప్రపంచ సాంస్కృతిక కేంద్రం, గ్యాస్ట్రోనమీ రాజధానిగా దుబాయ్ స్థానాన్ని నొక్కి చెబుతూ, ఈ గుర్తింపు నగరం యొక్క గొప్ప వారసత్వం, శక్తివంతమైన కలినరీ దృశ్యానికి నిదర్శనం. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ ట్రావెల్ గైడ్‌లలో ఒకటిగా, లోన్లీ ప్లానెట్ గుర్తింపు దుబాయ్‌ను సందర్శించడానికి, నివసించడానికి, పని చేయడానికి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మార్చాలనే మా నిరంతర లక్ష్యం వెల్లడిస్తుందని అని అన్నారు
లోన్లీ ప్లానెట్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్ మాట్లాడుతూ, 2026కి మా బెస్ట్ ఇన్ ట్రావెల్ జాబితా సందర్శకులు ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత చాలా కాలం పాటు వారితో నిలిచిపోయే అగ్రశ్రేణి అనుభవాలను అందిస్తుంది. ఓల్డ్ దుబాయ్‌లో సాంస్కృతిక ఆహార పర్యటన చేయడం దీనికి సరైన ఉదాహరణ. ప్రపంచంలోని అగ్రశ్రేణి గమ్యస్థానాలలో మేము ఎల్లప్పుడూ ఆశ్చర్యకరమైన, ప్రామాణికమైన అనుభవాలను అందించడానికి చూస్తున్నాము అని అన్నారు.