ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (18:54 IST)

ఆప్ఘనిస్థాన్‌లో కారు బాంబు దాడి.. డిప్యూటీ గవర్నర్ మృతి

bomb blast
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు విజృంభించారు. కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డిప్యూటీ గవర్నర్ ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలోని బదాక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అయిన నాసిర్ అహ్మద్ అహ్మాదీ కారుబాంబు దాడిలో మరణించారు. 
 
ఇటీవల ఐసీస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తాలిబన్ ప్రభుత్వం దాడులు మొదలు పెట్టిన నేపథ్యంలో ఐసిస్ ఉగ్రమూకలు పలు నగరాల్లో విచక్షణారహితంగా దాడులు నిర్వహించారు. 
 
తాజాగా బదాక్షన్ ప్రావిన్స్‌లో సంభవించిన బాంబు దాడిలో డిప్యూటీ గవర్నర్ మృతి చెందారు. ఇంకా డ్రైవర్ కూడా మరణించారు. మరో ఆరుగులు పౌరులు గాయాలకు గురైయ్యారు.