ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (21:46 IST)

మెక్సికోలో ఘోరం.. మనిషి తలను నోట కరుచుకుని వీధికుక్క ఏం చేసిందంటే?

మెక్సికోలో ఘోరం చోటుచేసుకుంది. వీధికుక్క ఏకంగా మనిషి తలను నోట కరుచుకుని పరిగెత్తింది. దీంతో జనం జడుసుకున్నారు. జకాటెకాస్ వీధుల్లో కుక్క తన నోటిలో మనిషి తలను పట్టుకుని పరిగెత్తడాన్ని చూశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పోలీసులు చివరికి కుక్క నోటి నుండి తలను తీసుకోగలిగారు. కుక్క నేరం జరిగిన ప్రదేశం నుండి మనిషి తలను తీసుకుని, దానిని తినడానికి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి ఉంటుందని తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలిని చేరుకునే లోపే కుక్క తలను పట్టుకుని పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
 
మోంటే ఎస్కోబెడో పట్టణంలోని ఏటీఎం బూత్‌లో తల, ఇతర శరీర భాగాలను వదిలివేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుడిని ఇంకా గుర్తించలేదు.