శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (13:44 IST)

దొంగతో 77 యేళ్ళ వృద్ధుడు రియల్ ఫైట్.. వీడియో వైరల్

సౌత్ వేల్స్‌లో తన వద్ద ఉన్న సొమ్మును దోచుకునేందుకు వచ్చిన ఓ దొంగతో 77 యేళ్ళ వృద్ధుడు రియల్ ఫైట్ చేశారు. ఈ ఫైట్‌లో ఆ తాత దెబ్బకు ఆ దొంగ బెంబేలెత్తుకుని కాలికి పనిచెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సౌత్ వేల్స్‌లోని సైన్‌బ్బూరీస్‌లో ఓ 77 యేళ్ళ వృద్ధుడు ఒకరు తన కారును పార్కింగ్ చేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న క్యాష్ మిషన్ (ఏటీఎం) వద్ద డబ్బులు డ్రా చేసుకున్నాడు. ఇంతలో వెనుక నుంచి ఓ దొంగ వచ్చి, ఆ తాత కాలర్ పట్టుకుని డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ వృద్ధుడు కూడా తిరగబడి చొక్కా పట్టుకోవడంతో ఇద్దరూ ఒకరినొకరు కొంతదూరం నెట్టుకుంటూ వెళ్లారు.
 
ఆ తర్వాత ఆ తాత తేరుకుని బాక్సర్‌లా మారి దొంగపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆ దొంగ బెంబేలెత్తిపోయి పారిపోయాడు. రియల్ దొంగతో ఈ తాతయ్య జరిగిన రియల్ ఫైట్ నిజంగా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. 
 
ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. ధైర్యసాహసాలు ప్రదర్శించడానికి వయసు అడ్డుకాదని తాతయ్య నిరూపించాడు. ఆ వృద్ధుడి బాక్సింగ్‌ పట్ల నెటిజన్లు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.