పేరుకే టిక్ టాక్ స్టార్.. చేసేది గ్యాంగ్‌తో దొంగతనాలు.. దొరికిపోయాడు..
టిక్ టాక్ స్టార్ దొరికిపోయాడు. అదీ మొబైల్ ఫోన్ల దొంగతనం కేసులో టిక్ స్టార్‌తో పాటు నలుగురిని నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయిన షారూఖ్ ఖాన్ అనే 23 ఏళ్ల యువకుడు.. తన స్నేహితులతో కలిసి దొంగతనానికి ప్లాన్ చేశాడు. కానీ బుధవారం మధ్యాహ్నం పోలీసులకు దొరికిపోయాడు.
షారూఖ్‌తోపాటు పట్టుబడిన మిగతా ముగ్గురిని అసిఫ్, ఫైజాన్, ముకేశ్‌లుగా పోలీసులు గుర్తించారు. షారూఖ్ ఖాన్‌కు 40వేల మంది ఫాలోవర్స్ వున్నారు. ఇక అరెస్టయిన షారూఖ్ గ్యాంగ్ నుంచి పోలీసులు నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.3,520 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, చోరీల కోసం ఉపయోగించే ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశారు. షారూఖ్ ఖాన్ గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడని పోలీసులు తెలిపారు.