హెలో - టిక్‌టాక్‌లపై నిషేధమా? కేంద్రం కొరఢా
ప్రస్తుతం కొత్తగా వచ్చిన సామాజిక మాధ్యమాలు హెలో - టిక్‌టాక్. ఇవి నెటిజన్లలో మంచి పాపులర్ అయ్యాయి. అయితే, వీటివల్ల అనేకు దుష్ఫరిణామలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వీటిపై నిషేధం విధించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. తాము సంధించిన 24 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని లేనిపక్షంలో నిషేధం ఎదుర్కోక తప్పదంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది.
అయితే, ఈ నోటీసులు జారీచేయడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్. హెలో, టిక్‌టాక్ యాప్‌లు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని పేర్కంటూ ఆ సంస్థ ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశాయి. దీంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సదరు సంస్థలకు నోటీసు జారీచేసింది. ఈ నోటీసుల్లో పలు ప్రశ్నలను సంధించింది.
అలాంటివాటిలో చిన్నారులు కూడా ఈ యాప్ వాడేలా ఎందుకు అనుమతిస్తున్నారంటూ ప్రశ్నించింది. అలాగే, భారతీయుల వివరాలను ఇంకెప్పుడూ విదేశీ ప్రభుత్వాలకు ఇవ్వబోమని హామీ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో కోరింది.
దీనిపై టిక్‌టాక్, హెలో అప్లికేషన్ సంస్థలు సంయుక్తంగా స్పందించాయి. తమకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని, అందువల్ల భారత ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు పూర్తిగా సహకరిస్తామని అక్కడి సమాజం పట్ల భాధ్యతతో వ్యవహరిస్తామని వారు పేర్కొన్నారు.