శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (11:30 IST)

టిక్‌టాక్‌ ఉప్పల్ బాబు.. ఆకతాయి ఆ పనిచేస్తే.. కామ్‌గా వెళ్ళిపోయాడు..

టిక్‌టాక్‌పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. టిక్ టాక్ మోజులో ప్రభుత్వ ఉద్యోగులు పనులు సైతం పక్కనపెట్టి వీడియోలు చేస్తూ దొరికిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే ఉప్పల్ బాలు మాత్రం టిక్‌టాక్ తనకు ఓ గుర్తింపునిచ్చిందని.. బతకుదెరువునిచ్చిందని చెబుతున్నాడు. టిక్‌టాక్ వల్లే పలు టీవీ సీరియల్స్, రియాలిటీ షోలు చేస్తున్నానని చెబుతున్నాడు.
 
టిక్‌టాక్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న ఉప్పల్ బాలు.. బిగ్‌బాస్ హౌజ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదని ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. కానీ ప్రస్తుతం అతనికి చేదు అనుభవం ఎదురైంది. 
 
హైదరాబాద్ జెమినీ నగర్‌లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొనగా.. ఓ ఆకతాయి బాలు పట్ల దురుసుగా ప్రవర్తించాడు. గుంపులో నిలబడి బాలు నెత్తిపై వెనుక నుంచి రెండుసార్లు కొట్టి ఏమీ ఎరగనట్టు నిలుచుండిపోయాడు. 
 
అయితే బాలు పక్కనున్న వ్యక్తులు అతన్ని గమనించి వారించారు. ఆకతాయి చేసిన పనికి బాలు ఆగ్రహానికి గురైనప్పటికీ.. కామ్‌గా వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.