బండ్లగూడాలో దొంగల బీభత్సం... బంగారం-వెండి దోపిడి
రాజేంద్రనగర్ పోలిస్టేషన్ పరిధిలోని బండ్లగుడాలో దొంగల బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇల్లును గుల్ల చేశారు దుండగులు. పది తులాల బంగారం, 30 తులాల వెండి అపహరించారు.
ఖమ్మం ప్రాంతానికి చెందిన భాజా, సాధన అనే సాఫ్ట్వేర్ ఉద్యోగులు బండ్లగుడాలోని భారతి నగర్‌లో అద్దెకు ఉంటుంన్నారు. నిన్న సాయంత్రం భాజా సొంత పనిమీద ఖమ్మం వెళ్ళేందుకు భార్య సాధనాను పక్కనే ఉంటున్న అత్తవారింట్లో వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్ళాడు.
ఉదయం ఇంటి యజమాని ఇంటి వైపు చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో సాధనకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సాధన ఇంట్లోకి వెళ్ళి చూసే సరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి.
బీరువాలోని పది తులాల బంగారం, 30 తులాల వెండి కనిపించలేదు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పొలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌లను రంగంలోకి దింపి అధారాలను సేకరిస్తున్నారు.
కాలనీలో ఒక ఇంటిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రాత్రి టైంలో రికార్డ్ అయిన దృశ్యాల్లో కవర్ పట్టుకొని వెళ్తున్న వ్యక్తిని చూసి సాధన ఆ కవర్ వాళ్ల ఇంట్లోనిది అని గుర్తుంచింది.