శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (21:21 IST)

ట్రంప్‌కు చుక్కెదురు - హెచ్1బి వీసా ఆశావహులకు శుభవార్త

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఇటీవల హెచ్-1బి వీసా కార్యక్రమంలో ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్పులను యుఎస్ కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ చర్య భారత ఐటీ రంగానికి బాగా ఉపయోగపడనున్నది. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందు ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌-1 బీ వీసా మార్పులు, కనీస వేతన స్థాయిలను పెంచడం, అర్హత అవసరాలను కఠినతరం వంటివి తీసుకొచ్చింది. కీలకమైన విధానపరమైన చర్యలను దాటవేయడానికి ట్రంప్ ప్రభుత్వం ఎంపికను సమర్థించలేదని, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాన్ని, కార్మిక శాఖను విరమించుకునే విధానాల కోసం కూడా కోర్టు తీర్పు ఇచ్చింది.
 
కాలిఫోర్నియా ఉత్తర జిల్లాకు చెందిన యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జెఫ్రీ వైట్.. యుఎస్ కంపెనీల సామర్థ్యాన్ని పరిమితం చేయడానికి కార్మిక, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలు ప్రతిపాదించిన హెచ్ -1 బీ నిబంధనలపై రెండు మధ్యంతర తుది నియమాలను (ఐఎఫ్ఆర్) అడ్డుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
డీఓఎల్‌ ఐఎఫ్‌ఆర్‌ ప్రస్తుత వేతన రేట్లను లెక్కించే పద్ధతిని కూడా మార్చేసింది. డీహెచ్‌ఎస్‌ ఐఎఫ్‌ఆర్‌ ఏకకాలంలో హెచ్‌-1 బీ వీసా కార్యక్రమంలో అనేక మార్పులు చేసింది. వీటిలో ప్రత్యేక వృత్తి యొక్క రెగ్యులేటరీ నిర్వచనాలకు సవరణలు, యజమాని - ఉద్యోగి సంబంధం, థర్డ్‌ పార్టీ ఉద్యోగంలో పనిచేసే కార్మికులకు చెల్లుబాటు కాలానికి తగ్గింపులు ఉన్నాయి.
 
ఈ చర్యపై సాఫ్ట్‌వేర్ బాడీ నాస్కామ్ స్పందించింది. "అమెరికాకు అధిక నైపుణ్యం గల వీసా ప్రోగ్రామ్‌ల ప్రాముఖ్యతను స్పష్టంగా గుర్తించే కోర్టు నిర్ణయాలను మేము స్వాగతిస్తున్నాం. గతంలో జారీ చేసిన ఐఎఫ్‌ఆర్‌లు లీగల్‌ స్టాట్యూట్స్‌ కలిగి ఉండవు. నాస్కామ్ దీనిని నమ్ముతుంది. కొవిడ్ అనంతర ప్రపంచంలో ఆర్థిక పునరుద్ధరణ దశకు కీలకమైన ప్రతిభను యుఎస్ వ్యాపారాలు తిరిగి ప్రారంభించడానికి ఈ తీర్పు సహాయపతుంది" అని పేర్కొన్నది.  
 
కాగా, భారత్‌, చైనా దేశాలు ప్రతి ఏటా గరిష్ట సంఖ్యలో హెచ్ -1 బీ వీసాలు పొందుతాయి. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 2.78 లక్షల మంది భారతీయులకు ఎఫ్ -119లో హెచ్-1బీ వీసాలు వచ్చాయి. ఈ వీసాల్లో ఎక్కువ భాగం గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ మేజర్లతోపాటు భారతీయ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు భారతదేశం నుంచి అమెరికాకు ఇంజనీర్లను విధుల్లో మోహరించడానికి ఉపయోగిస్తున్నాయి.