శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (10:57 IST)

ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కిమ్.. మాయమైతే అడగొద్దు: సీఐఏ

నిత్యం వివాదాస్పద ప్రకటనలు, క్షిపణి పరీక్షలతో ప్రపంచంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనేందుకు కారణభూతుడుగా ఉన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కనిపించకుండా పోతే తమను మాత్రం అడగొద్దని ఆయన యూఎస్ గూఢచ

నిత్యం వివాదాస్పద ప్రకటనలు, క్షిపణి పరీక్షలతో ప్రపంచంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనేందుకు కారణభూతుడుగా ఉన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కనిపించకుండా పోతే తమను మాత్రం అడగొద్దని ఆయన యూఎస్ గూఢచార విభాగం సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నిత్యమూ అధికారం కోసం తాపత్రయపడుతూ, తమ దేశ ప్రజలతో పాటు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నారని, ఆయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 
 
గత కొంతకాలంగా వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్న ఆయన, ఇకపై చడీచప్పుడు లేకుండా ఉంటే, ఏం జరిగిందో తమను ప్రశ్నించవద్దని ఆయన వ్యాఖ్యానించారు. కిమ్ జాంగ్ ఉన్ నాశనమైపోతే, అది చరిత్రలో మిగిలిపోతుందే తప్ప, తాను మాత్రం ఆ విషయం గురించి మాట్లాడబోనని పాంపియో వ్యాఖ్యానించడంగ గమనార్హం.