గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (09:21 IST)

చీమకుట్టి మహిళ మృతి.. ఎక్కడో తెలుసా?

చీమకుట్టి మహిళ మృతి చెందిందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. సాధారణంగా మనిషిని చీమ కుడితే చీమ చనిపోతుందని అందరికీ తెలిసిందే. కానీ సౌదీ అరేబియాలో మాత్రం చీమకుట్టి మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.

చీమకుట్టి మహిళ మృతి చెందిందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. సాధారణంగా మనిషిని చీమ కుడితే చీమ చనిపోతుందని అందరికీ తెలిసిందే. కానీ సౌదీ అరేబియాలో మాత్రం చీమకుట్టి మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఆదోర్‌కు చెందిన సోఫీ జెస్సీ (36) సౌదీలోని రియాధ్‌లో నివాసం ఉంటోంది. కొన్నాళ్ల క్రితం ఆమె ఇంటి పని చేస్తుండగా.. చీమ కుట్టింది. 
 
దీంతో జెస్సీ అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ జెస్సీ మృతి చెందింది. సౌదీలో కొన్ని రకాల చీమలు కుడితే విషం శరీరంలోకి చేరిపోతుందని వైద్యులు అంటున్నారు. ఇదే తరహాలోనే జెస్సీని కుట్టిన చీమ నుంచి ఆమె శరీరంలోకి విషం చేరిందని.. ఈ కారణంతోనే ఆమె మరణించిందని వైద్యులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని రియాధ్‌కు చెందిన వార్తా సంస్థ కూడా వెల్లడించింది.