గురువారం, 27 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2025 (13:55 IST)

అయ్యో ఎంతపని జరిగింది, అమెరికాలో దొంగతనం చేసి పట్టుబడ్డ భారతీయ విద్యార్థునులు (video)

Indian girl student arrest in US
అమెరికాలో భారతీయ విద్యార్థినీవిద్యార్థుల పరిస్థితులు దిగజారిపోతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ దెబ్బకి అక్కడ చాలామంది విద్యార్థినీవిద్యార్థులు మింగలేక కక్కలేక అక్కడే ఏదోలా స్థిరపడాలని ప్రయత్నం చేస్తున్నారు. చదువుకుంటే ఇదివరకు ఉద్యోగాలు చేసుకునే అవకాశం వుండేది. కానీ ఇప్పుడది కష్టతరంగా మారిపోయింది.
 
ఎమ్మెస్ చదివేందుకు వెళ్లిన విద్యార్థులు అక్కడ ఖర్చుల కోసం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అలాగని స్వదేశానికి రమ్మంటే వచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారు. లక్షలకు లక్షలు కట్టి అక్కడికి వెళ్లి ఉత్త చేతులతో వచ్చేందుకు వారు సిద్ధపడటంలేదు. ఎలాగైనా అక్కడే స్థిరపడాలన్న పట్టుదలతో వుంటున్నారు. ఐతే ఈ పట్టుదలే కొంతమందిని పక్కదోవ పట్టేలా చేస్తోందంటున్నారు.
 
తాజాగా అమెరికాలో ఇద్దరు‌ భారతీయ విద్యార్థునులు ఓ షాపులో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. తమకు అవసరమైన వస్తువులు తీసుకుని బిల్లు కట్టకుండా వెళ్లిపోతుండగా షాపు యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని తనిఖీ చేసి విచారించగా దోపిడీకి పాల్పడ్డ తేలింది. దీనితో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసారు.