మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (14:30 IST)

భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలీస్థానీ అటాక్

khalistani
లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయంపై ఖలీస్థానీ వేర్పాటువాదులు దాడికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న ఖలీస్థానీ వేర్పాటువాదులు.. పలు దేశాల్లోని రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతూ. ఆ హైకమిషన్ కార్యాలయ భవనాలపై ఉండే జాతీయ జెండాను దించేచి తమ ఖలీస్థానీ జెండాను ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలోనే లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేసి వారి జెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు. 
 
ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. అలాగే, ఈ ఘటనను బ్రిటన్ పోలీసులు చూస్తూ ఊరుకోవడం పట్ల కూడా భారత ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో ఖలీస్థానీ వేర్పాటువాదులు ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోనూ రాయబార కార్యాలయాలపై దాడులు దిగారు. ఆయా దేశాల ప్రభుత్వాలు వీటిని అడ్డుకోవాలంటూ ఆయా దేశాలను భారత ప్రభుత్వం కోరిన విషయం తెల్సిందే.