1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (13:35 IST)

భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం.. కొడవళ్ళతో డ్రాగన్ కంట్రీ బుసలు

భారత సరిహద్దుల్లో చైనా బలగాలను మోహరిస్తోంది. భారత సరిహద్దుకు కేవలం అరకిలోమీటర్ దూరంలో చైనా యుద్ధ విన్యాసాలు చేస్తోంది. హెచ్-6 బాంబర్లను సైతం రంగంలోకి దింపి భారత్‌ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. 

మరోవైపు విన్యాసాల్లో అణుబాంబులను జారవిడిచే ఫైటర్‌ జెట్‌లను కూడా వినియోగిస్తూ శిక్షణను ఇస్తోంది. భారత్ చైనాకు యుద్ధం జరిగితే ఎలాంటి ఆయుధాలు ఉపయోగించాలి, అవి ఎలా ఉపయగించాలి అనేదానిపై శిక్షణ ఇస్తుంది. 
 
అంతేకాకుండా లడఖ్‌కు అతి సమీపంలో యుద్ధవిమానాలను మోహరించింది. ఇక డ్రాగన్ చర్యలకు భారత ఆర్మీ దీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్ధమౌతోంది. లఢక్‌లో డ్రాగన్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతోంది.

భారత ఆర్మీ సుఖోయ్‌, మిగ్‌ విమానాలను సరిహద్దుల్లో మోహరించింది. ఇక తాజాగా రాఫెల్ జెట్ యుద్ధవిమానాలను రంగంలోకి దింపుతోంది. దీంతో ఎల్‌ఏసీ దగ్గర చైనా చర్యలతో యుద్ధవాతావరణం కనిపిస్తోంది. 
 
కాగా... భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. కొడవళ్లు బిగించిన కర్రలను ఆయుధాలుగా ధరించిన చైనా సైనికులు తూర్పు లద్ధాఖ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంట మోహరించారంటూ ఏఎన్ఐ వార్తా సంస్థ పలు ఫొటోలను ప్రచురించింది. 
 
ఈ ఫోటోల్లో దాదాపు 25మంది చైనా సైనికులు తుపాకీలు పట్టుకుని నిల్చున్నారు. కానీ తుపాకీలు కిందకు దించి ఉన్నాయి. అలాగే కొడవళ్లు బిగించిన కర్రలు కూడా వారి చేతుల్లో ఉన్నాయి. ఇవి తూర్పు లద్దాఖ్‌లోని భారత దక్షిణ పోస్టు ముఖ్పారి వద్ద తీసినవని చెప్తున్నారు.