ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు
పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదులు ఎంతో ధైర్యంగా తిరుగుతుంటారు. వాళ్లకు విలాసవంతమైన భవనాలు, కట్టుదిట్టమైన భద్రత వుంటుంది. చెప్పాలంటే వాళ్లు సెలబ్రిటీల కంటే ఎక్కువగా కాపాడుతుంటుంది అక్కడి ప్రభుత్వం. ఐతే భారతదేశంలో పహెల్గాం ఉగ్రదాడి జరిగిన దగ్గర్నుంచి పాకిస్తాన్ దేశంలో విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్న ఉగ్రవాదులకు కంటిమీద కునుక వుండటం లేదట.
ఎప్పుడు ఎవరి పైన ఎటాక్ జరుగుతుందో జడుసుకు చస్తున్నారట. దీనికి కారణం తాజాగా మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజ్మానిని పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సిలో రోడ్డు పైన పిచ్చి కుక్కను కాల్చి చంపినట్లు చంపేసి వెళ్లిపోయాడట ఓ గుర్తు తెలియని సాయుధుడు. దీనితో పాకిస్తాన్ దేశంలో వుంటున్న ఉగ్రవాదులు భయంతో వణికిపోతున్నారట.
2006లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్యార్టర్స్ పేలుళ్ల ప్రధాన సూత్రధారి రజౌల్లాను రోడ్డుపైనే కాల్చి చంపడంతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాక్కుంటున్నారట. రజౌల్లాను ఆదివారం నాడు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఓ సాయుధుడు నేరుగా వచ్చి తుపాకీతో కాల్చి చంపి అక్కడి నుంచి పారిపోయాడు. ఉగ్రవాది రజౌల్లా 2005లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పైన దాడి చేసాడు. 2008లో బెంగళూరులోని సీఆర్పిఎఫ్ క్యాంపు పైన దాడి చేసాడు. ఇప్పుడు కుక్క చావు చచ్చాడు.