గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (12:53 IST)

మాల్దీవుల్లో ఎమర్జెన్సీ : సుప్రీం న్యాయమూర్తుల అరెస్టు

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆ దేశ సుప్రీంకోర్టుకు చెందిన న్యాయమూర్తులు జస్టిస్ అబ్దుల్లా సయీద్, అలీ హమీద్‌లను సైన్యం అరెస్టు చేసింది. 12 మంది విపక్ష ఎంపీలపై అనర్హత పేరుతో వేసిన వేటు

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆ దేశ సుప్రీంకోర్టుకు చెందిన న్యాయమూర్తులు జస్టిస్ అబ్దుల్లా సయీద్, అలీ హమీద్‌లను సైన్యం అరెస్టు చేసింది. 12 మంది విపక్ష ఎంపీలపై అనర్హత పేరుతో వేసిన వేటు చెల్లదని, జైల్లో ఉన్న వారందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ తోసిపుచ్చి సోమవారం రాత్రి ఎమర్జెన్సీ ప్రకటించి, ఈ అత్యయికస్థితి 15 రోజుల పాటు కొనసాగుతుందని ఆదేశాలు జారీచేశారు. 
 
ఫలితంగా మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ముదిరిపాకాన పడినట్టయింది. విపక్ష సభ్యులకు అనుకూలంగా తీర్పునిచ్చిన న్యాయమూర్తులను అరెస్టు చేయించారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తి పరిస్థితి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు దేశంలో 15 రోజులపాటు అత్యవసర స్థితిని విధిస్తున్నట్టు రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. 
 
ముఖ్యంగా, ప్రతిపక్ష నేతలను విడుదల చేయాలంటూ సుప్రీం ఆదేశించిన తర్వాత మాజీ అధ్యక్షుడు నషీద్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీంతో రాజధాని మాలిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కోర్టు ఆదేశాలను పాటిస్తామన్న పోలీస్ చీఫ్‌ అహ్మద్ అరిఫ్‌ను ప్రభుత్వం తొలగించింది.