శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (14:13 IST)

కరోనా వైరస్‌ సోకిన పురుషుల్లో వీర్య ఉత్పత్తి వుండదా?

కరోనా వైరస్‌ సోకిన పురుషుల్లో వీర్య ఉత్పత్తిని దెబ్బతినే అవకాశం వుందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య రెండు లక్షలకు చేరింది. ఇందులో పురుషుల సంఖ్య 8వేలను దాటింది. కరోనా సోకితే.. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ వుంది. ఇంకా దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి ఏర్పడుతాయి. 
 
అయితే తాజాగా కరోనా వైరస్ కారణంగా పురుషుల్లో వీర్య ఉత్పత్తి దెబ్బతినే అవకాశం వుందని ఓ అధ్యయనం తేల్చింది. కరోనా వైరస్‌పై జరిపిన పరిశోధనలో ఊపిరితిత్తులు , రోగ నిరోధక వ్యవస్థకు  ఇబ్బంది ఏర్పడుతుంది. ఇంకా పురుషుల్లో వీర్య ఉత్పత్తి తగ్గిపోతుందని.. కానీ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని చైనా పరిశోధకులు పేర్కొన్నారు.