ఉద్యోగులకు మెటా సీరియస్ వార్నింగ్.. మూడు రోజులు రాకపోతే..
ఉద్యోగులకు మెటా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రతి వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలని..కొత్త రూల్స్ పెచ్చింది. నూతన నిబంధనలకు పాటించని వారు తమ ఉద్యాగాలను కోల్పోవాల్సి వుంటుంది. సెప్టెంబర్ 5 నుంచి కార్యాలయాలకు కేటాయించిన ఉద్యోగులు వారంలో విధిగా మూడు రోజులు రావాలంటూ మానవ వనరుల విభాగం హెడ్ లోరి గోలర్ ఆదేశించారు.
టీమ్ సభ్యులు ఈ సూచనను విధిగా పాటిస్తున్నదీ, లేనిదీ మేనేజర్లు తనిఖీ చేయాలని లోరీ గోలర్ తెలిపారు. తరచుగా నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని మెటా హెచ్చరించింది. ఉద్యోగుల పనితీరు రేటింగ్ తగ్గించడంతోపాటు, మరీ తీవ్రమనిపిస్తే తొలగించడం జరుగుతుందని మెటా తెలిపింది.