మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (15:18 IST)

క్యాబ్‌కు ప్రవాస భారతీయుల సపోర్టు.. మద్దతుగా ర్యాలీ

సీఏఏ (సీఏబి), ఎన్నార్సీలకు వ్యతిరేకంగా భారత్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతుండగా మరోవైపు యూఎస్‌లోని వివిధ నగరాలలో వీటికి మద్దతుగా ఎన్నారైలు ర్యాలీ నిర్వహించారు. సీఏఏ, ఎన్నార్సీల చుట్టూ అలుముకున్న తప్పుడు సమాచారం, అపోహాలను తొలగిద్దామని ఈ సందర్భంగా ఎన్నారైలు నినాదించారు. 
 
పాక్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ దేశాల నుంచి 2014, డిసెంబర్ 31 వరకు భారత్‌కు వలస వచ్చిన హిందూ, సిక్కు, బుద్ధిస్టులు, జైనులు, పార్శీ, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించడమే సీఏఏ ముఖ్యోద్దేశం. ఇక ఈ బిల్లు చట్ట రూపం దాల్చినప్పటి నుంచి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

అయితే సీఏఏ, ఎన్నార్సీల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోకుండా కొందరు కావాలనే నిరసనలు చేపడుతున్నారని ఎన్నారైలు దుయ్యబట్టారు. కనుక వీటి చుట్టూ ఉన్న తప్పుడు సమాచారాన్ని, అపోహాలను తొలగించాలని యూఎస్‌లోని వివిధ నగరాలలో ఎన్నారైలు ర్యాలీలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ నెల 29న న్యూయార్క్ టైం స్క్వేర్  ముందు ప్రొ-సీఎఎ ర్యాలీ చేపట్టారు. అలాగే కాలిఫోర్నియాలో బే ఏరియా వద్ద  కూడా ర్యాలీ నిర్వహించారు.
 
ఇక తాజాగా నిర్వహించిన ర్యాలీల సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడారు. ఈ ర్యాలీలో అఫ్ బీజేపీ అమెరికా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఏనుగుల, అఫ్ బీజేపీ నేషనల్ యూత్ కో- కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, సత్య నారాయణ దోసపాటి, సానిల్, వంశీ యంజాల, మధుకర్, కరణ్ పాల్సనియా, చికాగో నుండి భరత్ బారాయి, కాలిఫోర్నియా నుండి సతీష్, న్యూయార్క్ నుండి శివదాసాన్ నాయర్, జయశ్రీ నాయర్, ధీరేన్ మేత పాల్గొన్నారు.
 
ఇండియన్ అమెరికన్ ఇంటెలెక్టుల్స్ ఫోరమ్, బాంగ్లాదేశ్ హిందూ సమూహం ఆధ్వర్యములో సీఏఏ మరియు సెక్కులరిజం పైన చర్చలు జరిపారు. ఎన్నార్సీ గురించి ఇస్లామిక్, వామపక్ష సంస్థల భయాలను తొలగించేందుకే ఈ చర్చ చేశామని అన్నారు. సీఏఏ, ఎన్నార్సీ చట్టాలతో తమను భారత్ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ముస్లింలు అభద్రత భావానికి లోనవుతున్నారని తెలిపారు. కనుక వారి అపోహాలను తొలగించేందుకు తాము ఈ చర్చని నిర్వహించామని పేర్కొన్నారు.
 
అఫ్ బీజేపీ అమెరికా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఏనుగుల మాట్లాడుతూ సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్న వారు ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్నారని, వీటి వెనుక ఉన్న వాస్తవాలను వినడానికి గానీ, మాట్లాడాటానికి గానీ వారు అంగీకరించడం లేదన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన ఈ మార్పులకు తాము పూర్తి మద్ధతు ఇస్తున్నామని ర్యాలీలో పాల్గొన్న ఎన్నారై  విలాస్ రెడ్డి జంబుల తెలిపారు. 
 
నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఆందోళనల పేరుతో ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిని(నిరసనకారులను) కఠినంగా శిక్షించాలని ఈ ర్యాలీలలో పాల్గొన్న ఎన్నారైలు డిమాండ్ చేశారు. న్యూయార్క్ నగర విధి , టైం స్క్వేర్ వద్ద కొత్త ఏడాది సందర్భముగా అక్కడ బాల్ డ్రాప్, సాంస్కృతిక  ఏర్పాట్లతో అమెరికా మొత్తం పూర్తి సెక్యూరిటీ, భారీ బందోబస్తు ఉంది.