మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (17:35 IST)

నీరవ్‌కు షాక్.. ఆర్థర్‌ రోడ్‌ జైలులోని 12వ బ్యారక్ సరిపోతుంది.. కోర్టు

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టు షాకిచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ)కి దాదాపు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే కేసుపై రెండేళ్లుగా కొనసాగుతున్న విచారణలో లండన్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. నీరవ్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని కోర్టు పేర్కొంది. 
 
ఇందులో భాగంగా నీరవ్‌ను విచారించేందుకు భారత్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. భారత్​కు అప్పగిస్తే తనకు న్యాయం జరగదని, ఆరోగ్య స్థితి సరిగ్గా లేదనే సాకులతో నీరవ్​ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. భారత్​కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందనే వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. భారత్‌కు అప్పగించినా ఆయనకు అన్యాయం జరగదని కోర్టు స్పష్టం చేసింది. 
 
నీరవ్​‌కు ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలులోని 12వ బ్యారక్​ సరిపోతుందని కోర్టు పేర్కొంది. అక్కడే ఆయనకు కావాల్సిన చికిత్స కూడా అందించాలని సూచించింది. నీరవ్ మోడీ సాక్ష్యాలను నాశనం చేశారని కోర్టు తెలిపింది.