మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (13:39 IST)

కోహ్లీలోని చిలిపి కోణం.. స్టీవ్ స్మిత్, జాక్వస్‌లను ఇమిటేట్ చేశాడు

మైదానంలో ఎల్లప్పుడూ చురుకుగా ఉండే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అది క్రికెట్ అభిమానులకు నచ్చుతుంది. కోహ్లీలో మరో కోణం కూడా ఉంది. అదే చిలిపి కోణం. మరోసారి తన చిలిపి చేష్టలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. 
 
మూడో టెస్టుకు ముందు ప్రాక్టీస్​ సెషన్​ సందర్భంగా విరాట్​.. దక్షిణాఫ్రికా క్రికెట్​ దిగ్గజం, ఆల్​రౌండర్​ జాక్వస్​ కలిస్​లా బౌలింగ్​ చేశాడు. ఆసీస్ స్టార్​ బ్యాట్స్​మెన్ స్టీవ్​ స్మిత్​ బ్యాటింగ్​ను అనుకరించాడు.
 
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలైంది. దాదాపు కలిస్​ బౌలింగ్​ శైలికి చాలా దగ్గరగా వచ్చాడు భారత కెప్టెన్. బ్యాటింగ్​ చేసిన అనంతరం స్మిత్ ఎలా ప్రవర్తిస్తాడో.. విరాట్​ చేసి చూపించాడు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.